అల్లరి యాక్షన్ 3 D సినిమా రివ్యూ
చిత్రం : యాక్షన్ 3 D
నటి నటులు : అల్లరి నరేష్),వైభవ్,రాజు సుందరం,కిక్ శ్యామ్),
స్నేహఉలాల్,నీలం ఉపాధ్యాయా
సంగీతం : బపీఎ ,బపీఎ లహరి , సన్నీ యం.ఆర్
దర్శకుడు :అనిల్ సుంకర
విడుదల :21-జూన్-2013
రేటింగ్ :2.30/5.00
కధాంశం :
ఇది ఓ నలుగురు స్నేహితుల కథ. బావ (అల్లరి నరేష్), శివ (వైభవ్), పురుష్ (రాజు సుందరం), అజయ్ (కిక్ శ్యామ్) నలుగురూ చిన్నప్పటి నుంచీ దోస్తులు. అజయ్ పెళ్లి కుదురుతుంది. దాంతో బ్యాచిలర్ పార్టీ కోసం హైదరాబాద్ నుంచి గోవా బయలు దేరతారు. బావ.. డబ్బు మనిషి. అడ్డదారుల్లో లక్షలు, కోట్లు సంపాదించాలనుకొంటాడు. దానికీ ఓ కారణం ఉంటుంది. తండ్రి ఓ హోటల్ కి యజమాని. ఆయన్ని స్నేహితులు మోసం చేసి.. ఆ హోటల్ని తమ పేర రాయించుకొంటారు. ఆ బాధలో తండ్రి చనిపోతాడు. ఎలాగైనా ఆ హోటల్ దక్కించుకోవాలనుకొంటాడు.. బావ. అయితే దాని కోసం కోటి రూపాయలు కావాలి. అందుకే.. పందాలు కాసి డబ్బులు పోగేయాలనుకొంటాడు. శివ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తననే పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. ఇక.. పురష్ జల్సా రాయుడు. వీళ్లంతా గోవాలో ఫుల్ గా మందు కొడతారు. అయితే పొద్దుట లేచి చూస్తే… అంతా గందరగోళంగా కనిపిస్తుంది. వారి హోటల్ గదిలో ఓ పులి వస్తుంది. ఓ పిల్లవాడు, కోడి కూడా ఉంటాయి. అయితే అజయ్ మాత్రం కనిపించడు. మరి అజయ్ ఏమయ్యాడు? ఇంతకీ పులి ఎలా వచ్చింది? అసలింతకీ ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ.
ఎమ్మెస్ నారాయణతో – దూకుడు తరహా వినోదం పండించాలని దర్శకుడు తెగ తాపత్రయపడ్డాడు. ఎమ్మెస్ చేత మహేష్, పవన్, సిద్దార్థ్ గెటప్పులు వేయించాడు.
నరేష్ టైమింగ్ ఎప్పట్లా బాగుది, కిక్ శ్యామ్ కి అంత సీన్ లేదు. సెకండాఫ్ లో ఆ పాత్ర కనిపించదు. వైభవ్ ఓకే. రాజుసుందరం చేతే ఎక్కువ పంచ్ లు వేయించారు. నలుగురు కథానాయికలు స్నేహా ఉల్లాల్ పబ్ డాన్సర్ అవతారంలో కనిపిస్తుంది. స్వాతి ముత్యపు జల్లులో రీమిక్స్ బాగా కుదిరింది. రాఘవేంద్రరావు స్టైల్ పాట కూడా ఒకే. త్రీడీ ఎఫెక్టులు మాత్రం అలరిస్తాయి
ఒక మాటలో చేపలంటే సినిమా లో 3 D ని బాగా వాడారు. దర్శకుడు చాల తెలివిగా సినిమా ను నడిపించాడు. సినిమాను మిస్ కావదు పిల్లల తో పాటు ప్రతి ఒకరు ఈ సినిమాను చుడచు
-మహేష్ గోనేమడతల
KEY WORDS :ACTION 3D MOVIE REVIEW,ACTION 3D MOVIE REVIEW IN TELUGU ,ALLARI NARESH NEW MOVIE REVIEW,ACTION 3D REVIEW, ACTION 3D TELUGU MOVIE REVIEW,TELUGU MOVIE ACTION 3D REVIEW,ACTION 3D REVIEW ,ACTION3D MOVIE RIVEW,ALLARI NARESH NEW 3D MOVIE REVIEW,NARESH 3D MOVIE TELUGU REVIEW
No comments:
Post a Comment